
ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ స్టేడియం వేదిక చెన్నై, ముంబై మధ్య జరిగిన మ్యాచులో అతిథ్య సీఎస్కే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబైను చిత్తు చేసి లీగ్‌లో బోణీ కొట్టింది. ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలిచింది.
ALSO READ | KL Rahul: లక్నోతో మ్యాచ్.. రాహుల్ ఆడతాడా.. ఢిల్లీ కెప్టెన్ ఏమన్నాడంటే..?
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. మాజీ సీఎస్కే ప్లేయర్, ప్రస్తుతం ముంబై తరుఫున ఆడుతోన్న దీపక్ చాహర్ సరదాగా ధోనిని స్లెడ్జింగ్ చేశాడు. చెన్నై ఇన్సింగ్స్ చివర్లో ధోని బ్యాటింగ్‌కు దిగాడు. ధోని క్రీజులోకి రాగానే అతడి దగ్గరికి వెళ్లిన దీపక్ చాహర్.. తమ బౌలర్లను ఎంకరేజ్ చేస్తూ ఫన్నీగా ధోనిని స్లెడ్జ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ధోని మాత్రం దీపక్ చాహర్‌ను పట్టించుకోలేదు. అనంతరం చెన్నై లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రౌండ్లో ఇరు జట్ల ప్లేయర్లు ఒకరికొకరు కరచాలనం చేసుకుంటుండగా ధోని తన బ్యాట్‌తో సరదాగా చాహర్‌ను వెనక నుంచి కొట్టబోయాడు. బెదిరిపోయిన చాహర్ వెంటనే ముందుకు పరిగెత్తాడు. చాహర్ ధోనిని స్లెడ్జింగ్ చేసేందుకు ప్రయత్నించడం, ధోని ఫన్నీగా చాహర్ ను కొట్టబోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు చాహర్, ధోని మధ్య మంచి బాండింగ్ ఉందని.. ధోని నాయకత్వంలో దీపక్ చాహర్ మరింత రాటుదేలాడని కామెంట్లు చేస్తున్నారు.
టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఐపీఎల్లో గత 7 సీజన్లు చెన్నె సూపర్ కింగ్స్ తరుఫున ఆడాడు. చెన్నై జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. అయితే.. జట్టు కూర్పులో భాగంగా చెన్నై యజమాన్యం రిటైన్ చేసుకోకపోవడంతో దీపక్ చాహర్ 2024 డిసెంబర్లో జరిగిన మెగా వేలంలోకి వచ్చాడు. ఆక్షన్‌లో ఆల్ రౌండర్ దీపక్ చౌహర్ను ముంబై ఇండియన్స్ టీమ్ కొనుగోలు చేసింది. దీంతో చెన్నైతో దీపక్‌కు ఉన్న 7 సంవత్సరాల బాండింగ్ తెగిపోయింది. ఆసక్తికరంగా ఈ సీజన్లో తొలి మ్యాచే చెన్నైకి ప్రత్యర్థిగా ఆడాడు దీపక్.
MS Dhoni giving BAT treatment to Deepak Chahar😭pic.twitter.com/2uYGLkFdpy
— ` (@lofteddrive45) March 23, 2025