Deepak Hooda: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. గ్రాండ్‌గా టీమిండియా క్రికెటర్ పెళ్లి

Deepak Hooda: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. గ్రాండ్‌గా టీమిండియా క్రికెటర్ పెళ్లి

టీమిండియా క్రికెటర్‌ దీపక్‌ హుడా పెళ్లి గ్రాండ్ గా జరిగింది. తన చిరకాల ప్రేయసితో వివాహం జరిగిందని సోమవారం(జూలై 15) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. హుడా తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటోలు వైరల్ గా  అవుతున్నాయి.

‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ..  కళ్ళలోని భావాలు కేవలం మా ఇద్దరికి మాత్రమే అర్ధమవుతాయి. ఈ మన ప్రయాణంలో  ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈ రోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి. మన ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా’’ అంటూ దీపక్‌ హుడా తన భార్యను ఉద్దేశించి పోస్ట్ చేశాడు. హుడాకు టీమిండియా ప్లేయర్స్ యజువేంద్ర చహల్‌, ఖలీల్‌ అహ్మద్‌, శిఖర్‌ ధావన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, శుభాకాంక్షలు తెలిపారు. 

టీమిండియా క్రికెటర్లు.. అభిమానులతో పాటు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ ఈ భారత క్రికెటర్ కు తన విషెస్ తెలిపాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా.. దీపక్‌ హుడా దంపతులను  ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ లో హుడా తరపున ఆడుతున్నాడు. టీమిండియా తరపున 10 వన్డేల్లో 153 పరుగులు.. 21 టీ20ల్లో 368 పరుగులు చేశాడు.