విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ తరహాలో మరో సినిమా రాబోతుందంటూ ముందు నుంచి టాక్ తెచ్చుకున్న మూవీ సిద్ధార్థ్ రాయ్ (Siddharthroy). ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్స్ లోకి వచ్చింది. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన వి యశస్వి (V Yeshasvi) ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమాలో మహేశ్ బాబు అతడు మూవీలో కమెడియన్ బ్రహ్మానందం పొట్టపై చిన్న పంచ్ ఇచ్చిన బుడ్డోడు(దీపక్ సరోజ్)..హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో క్యారెక్టరైజేషన్, బాడీలాంగ్వేజ్ యారోగెంట్‌గా కనిపించడంతో సిద్ధార్థ్ రాయ్ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిన..సినిమా మాత్రం కమర్షియల్ సక్సెస్‌గా నిలవలేకపోయింది.
ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీకి రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోన్నట్లు సమాచారం. మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిద్ధార్థ్ రాయ్ స్ట్రీమింగ్ అవుతుందంటూ టాక్ వినిపిస్తోంది.ఇదే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కథేంటంటే:
పన్నెండేళ్లకే దాదాపు ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీ పుస్తకాలన్నీ, చదివిన కుర్రాడు సిద్ధార్థ్ (దీపక్ సరోజ్). చిన్నప్పట్నుంచి కేవలం బుక్స్ కి మాత్రమే బానిసయి లాజిక్స్ తో ఎమోషన్స్ లేని ఒక జీనియస్ కుర్రాడిలా పెరుగుతాడు. అతనికి ఎలాంటి ఎమోషన్స్ లేవు..కేవలం అతనికి కావాల్సిన అవసరాలు తప్ప! కోరిక కలిగితే దగ్గరలో కనిపించిన అమ్మాయితో మాట్లాడి, ఆమెను ఎలాగైనా ఒప్పించి కోరిక తీర్చుకుంటాడు. క్లాసులో మాస్టారు చెబుతున్న లెసన్ తనకు తెలిస్తే ఇక మధ్యలో వెళ్లిపోతాడు. నిద్ర వస్తే రోడ్డు మీద పడుకుంటాడు. ఆకలి వేస్తే కనబడిన ఆకులు తింటాడు.ఇక మనిషికి కావాల్సిన అవసరాలు తిండి, నిద్ర,సెక్స్ మాత్రమే అని..అందరూ వాటి కోసం బతుకుతున్నాం అంటూ ఎలాంటి ఎమోషన్స్ లేని సిద్దార్థ రాయ్ లైఫ్ లో ఇందు (తన్వి నేగి) వస్తుంది.
ఎప్పుడు అందరికంటే జీనియస్ అని ఫీల్ అయ్యే సిద్దార్థని ఇందు ఓ కాంపిటేషన్ లో ఓడిస్తుంది. ఓడించడమే కాకుండా ఎమోషన్స్ లేని లైఫ్ వేస్ట్ అంటూ అగ్రెసివ్ గా మాట్లాడుతుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రతిఒక్కరూ ఇందుని పొగడటంతో పాటుగా సిద్దార్థ ని కామెంట్ చేయడంతో అతనిలో ఉన్న ఈగో అనే ఎమోషన్ మొదలయి..తర్వాత తిండి, నిద్ర, సెక్స్ దొరకకపోవడంతో తనలోని ఎమోషన్స్ పూర్తిగా బయటకి వస్తాయి.
ALSO READ :- ఎండాకాలం కదా.. రూ.30 వేల రూపాయల్లో ఏసీ ఆఫర్స్
ఇందుతో ప్రేమలో ఉన్నప్పుడు సిద్ధార్థ్ ఎలా ఉన్నాడు? ప్రేమించాక సిద్ధార్థ్ ఏం తెలుసుకున్నాడు? ఒక్కసారిగా ఎమోషన్స్ వచ్చాక సిద్దార్థ రాయ్ ఎలా మారాడు? సిద్ధార్థ్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఇందు అతడితో ఎందుకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది? తనకు ఇందు కావాలని ప్రతి రోజూ వాళ్లింటికి వెళ్లి గొడవ చేసే సిద్ధార్థ్..చివరికి ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చింది? సిద్దార్థ రాయ్ ఇందు ప్రేమ కథ ఏమైంది? అనేది ఈ సినిమా కథ.