విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ తరహాలో మరో సినిమా రాబోతుందంటూ ముందు నుంచి టాక్ తెచ్చుకున్న మూవీ సిద్ధార్థ్ రాయ్ (Siddharthroy). ఇవాళ (ఫిబ్రవరి 23న) సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన వి యశస్వి (V Yeshasvi) ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో మహేశ్ బాబు అతడు మూవీలో కమెడియన్ బ్రహ్మానందం పొట్టపై చిన్న పంచ్ ఇచ్చిన బుడ్డోడు(దీపక్ సరోజ్)..సిద్ధార్థ్ రాయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ట్రైలర్తో ఆకట్టుకున్న సిద్ధార్థ్ రాయ్..రిలీజ్ అయ్యాక టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే:
పన్నెండేళ్లకే దాదాపు ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీ పుస్తకాలన్నీ, చదివిన కుర్రాడు సిద్ధార్థ్ (దీపక్ సరోజ్). చిన్నప్పట్నుంచి కేవలం బుక్స్ కి మాత్రమే బానిసయి లాజిక్స్ తో ఎమోషన్స్ లేని ఒక జీనియస్ కుర్రాడిలా పెరుగుతాడు. అతనికి ఎలాంటి ఎమోషన్స్ లేవు..కేవలం అతనికి కావాల్సిన అవసరాలు తప్ప! కోరిక కలిగితే దగ్గరలో కనిపించిన అమ్మాయితో మాట్లాడి, ఆమెను ఎలాగైనా ఒప్పించి కోరిక తీర్చుకుంటాడు. క్లాసులో మాస్టారు చెబుతున్న లెసన్ తనకు తెలిస్తే ఇక మధ్యలో వెళ్లిపోతాడు. నిద్ర వస్తే రోడ్డు మీద పడుకుంటాడు. ఆకలి వేస్తే కనబడిన ఆకులు తింటాడు.ఇక మనిషికి కావాల్సిన అవసరాలు తిండి, నిద్ర,సెక్స్ మాత్రమే అని..అందరూ వాటి కోసం బతుకుతున్నాం అంటూ ఎలాంటి ఎమోషన్స్ లేని సిద్దార్థ రాయ్ లైఫ్ లో ఇందు (తన్వి నేగి) వస్తుంది.
ఎప్పుడు అందరికంటే జీనియస్ అని ఫీల్ అయ్యే సిద్దార్థని ఇందు ఓ కాంపిటేషన్ లో ఓడిస్తుంది. అంతేకాదు ఓడించడమే కాకుండా ఎమోషన్స్ లేని లైఫ్ వేస్ట్ అంటూ అగ్రెసివ్ గా మాట్లాడుతుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రతిఒక్కరూ ఇందుని పొగడటంతో పాటుగా సిద్దార్థ ని కామెంట్ చేయడంతో అతనిలో ఉన్న ఈగో అనే ఎమోషన్ మొదలయి..తర్వాత తిండి, నిద్ర, సెక్స్ దొరకకపోవడంతో తనలోని ఎమోషన్స్ పూర్తిగా బయటకి వస్తాయి.
ఇందుతో ప్రేమలో ఉన్నప్పుడు సిద్ధార్థ్ ఎలా ఉన్నాడు? ప్రేమించాక సిద్ధార్థ్ ఏం తెలుసుకున్నాడు? ఒక్కసారిగా ఎమోషన్స్ వచ్చాక సిద్దార్థ రాయ్ ఎలా మారాడు? సిద్ధార్థ్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఇందు అతడితో ఎందుకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది? తనకు ఇందు కావాలని ప్రతి రోజూ వాళ్లింటికి వెళ్లి గొడవ చేసే సిద్ధార్థ్ చివరికి ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చింది? చివరికి సిద్దార్థ రాయ్ ఇందు మధ్య ప్రేమ కథ ఏమైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read :మా సినిమాకి పిల్లబచ్చాలు రావొద్దు..ఎందుకుంటే మాది A సినిమా
ఎలా ఉందంటే?
మై కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ డిఫెరెంట్..దిస్ ఈజ్ సిద్ధార్ధ్ రాయ్ అనేలా ఉంది. ఇంకా లోతుగా చెప్పాలంటే.. బలమైన భావోద్వేగాలతో కూడిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆకట్టుకునేలా ఉంది. లాజిక్స్ వర్సెస్ ఎమోషన్స్ తో సినిమా కథను రాసుకున్న డైరెక్టర్ చాలా ఇంటెన్స్ గా తెరకెక్కించాడు.సకల ఐశ్వర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి దూరంగా బతికిన యువకుడు..చివరికి బంధాల విలువ ఎలా తెలుసుకోవడానికి ఎంత దూరం వెళ్లాల్సి వచ్చింది. అతనికి ఎదురైనా అనుభవాలు ఏంటనేది 'సిద్ధార్థ్ రాయ్' మూవీ కథ.
ఒక మనిషిలో ఎలాంటి ఎమోషన్స్ లేనప్పుడు అందరి మధ్య ఎలా ఉన్నాడు? ఈగో, కోపం, ప్రేమ..లాంటి భావోద్వేగ ఎమోషన్స్ వచ్చిన తర్వాత, అవి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటంతో ఆ మనిషి చివరికి ఏమయ్యాడు అనేది డైరెక్టర్ చూపించారు.
ఫస్టాఫ్ విషయానికి వస్తే సిద్దార్థ రాయ్ క్యారెక్టర్ గురించి అందరూ క్లాస్ లో పాఠం చెప్పినట్టు చెప్పడమే సరిపోతుంది. రొమాంటిక్ బోల్డ్ సీన్లు యూత్ ను ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ కి అతనిలో దాగున్న ఎమోషన్స్ ఒక్కసారిగా బయటకి వచ్చే సరికి నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ ఆడియాన్స్ లో కలుగుతుంది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఫెయిల్ అవుతున్నా' అని ప్రీ క్లైమాక్స్‌లో హీరో చెప్పే డైలాగ్ అదిరిపోతుంది.
ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ మరీ ఎక్కువైపోతే సిద్దార్థ రాయ్ ఏం చేయాల్సి వచ్చింది అన్నట్టు సినిమా సాగుతుంది. హీరో రియలైజ్ అయ్యే సీన్లను డైరెక్టర్ బాగా తెరకెక్కించారు. సినిమాలో హీరో తప్ప కనపడిన అందరూ లాజిక్స్, ఎమోషన్స్ గురించి క్లాస్ చెప్తూనే ఉండటం వల్ల కొన్ని సార్లు ఏదో క్లాస్ విన్న ఫీలింగ్ వస్తోంది. తిండి, నిద్ర, శృంగారం..ఈ మూడు ఉంటే చాలు అనుకునే..తన జీవితంలోకి వచ్చిన ఇందు..నిజమైన ప్రేమ ఏంటో చూపేంచేలా ఉంది.
ఎవరెలా చేశారంటే:
హీరో దీపక్ సరోజ్ మాత్రం నటన పరంగా అదరగొట్టాడు.తన వయసుకు, రూపానికి మించిన క్యారెక్టర్ ని చేసి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో చేసిన అనుభవం ఉండటంతో ఎమోషనల్ సీన్లు బాగా చేశారు.
అంతేకాదు ఎమోషన్స్ లేని వ్యక్తిలా, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిలా, తాను ఇష్టపడి..ప్రేమించిన అమ్మాయి ఒక్కసారిగా దూరమైన అబ్బాయి పడే బాధతో..ఇలా పలు డిఫరెంట్ షేడ్స్ లో దీపక్ మెప్పించాడు. ఇలాంటి వ్యక్తిని ప్రేమికురాలిగా భరించే పాత్రలో హీరోయిన్ తన్వి నేగి ఆకట్టుకుంది. బోల్డ్ సీన్లు ధైర్యంగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నీకల్ విషయానికి వస్తే:
అర్జున్ రెడ్డి మూవీకి మ్యూజిక్ అందించిన రధన్..ఈ సినిమాకు సంగీతం అందించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది.కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు పనితనం బాగుంది. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వి.యశస్వి అందించగా..సినిమాని నడిపించిన విధానం బాగుంది. కథ పాతది అయినా దాంట్లో లాజిక్స్, ఎమోషన్స్ అనే అంశాన్ని తీసుకోవడం కొత్తగా అనిపిస్తుంది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా నిర్మించగా..సినిమా కోసం బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది. .