ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో దీపక్‌‌‌‌‌‌‌‌, ఉదిత్‌‌‌‌‌‌‌‌కు రజతాలు

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో దీపక్‌‌‌‌‌‌‌‌, ఉదిత్‌‌‌‌‌‌‌‌కు రజతాలు

అమాన్ (జోర్డాన్‌‌‌‌‌‌‌‌): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా రెజ్లర్లు దీపక్ పునియా, ఉదిత్ రజత పతకాలు సాధించారు. ఆదివారం జరిగిన మెన్స్ ఫ్రీ స్టయిల్‌‌‌‌‌‌‌‌ 61 కేజీ ఫైనల్ బౌట్‌‌‌‌‌‌‌‌లో ఉదిత్ 4–6 తేడాతో టకార సుడా (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడిపోయాడు.  

92 కేజీ ఫైనల్లో దీపక్ 0–10 తేడాతో అమీర్ (ఇరాన్‌‌‌‌‌‌‌‌)  చేతిలో చిత్తయ్యాడు. 125 కేజీ బౌట్‌‌‌‌‌‌‌‌లో దినేశ్ 14–12 తేడాతో సపారోవ్ (తుర్క్‌‌మెనిస్తాన్‌‌)ను ఓడించి కాంస్యం నెగ్గాడు. దాంతో ఈ టోర్నీని ఇండియా ఒక స్వర్ణం సహా 10 పతకాలతో ముగించింది.