![శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం](https://static.v6velugu.com/uploads/2021/11/Deepavali-Asthanam-In-Tirumala-Tirupati-Temple_8kxep53uf6.jpg)
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో శ్రీవారి బంగారు వాకిలిలో... ఆస్థాన వేడుకను నిర్వహించారు. దీపావళి సందర్భంగా 'దీపావళి ఆస్థానాన్ని' చేశామన్నారు ఆలయ ఈవో జవహర్ రెడ్డి. శ్రీవారి ఆశీస్సులతో కరోనా అంతమై.. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నామని చెప్పారు ఈవో.