దీపావళి రోజు ( అక్టోబర్ 31) సాయంత్రం ప్రదోష కాలంలో దీపాలు వెలిగించి ఓ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలని పండితులు చెబుతున్నారు. దీని వలన కష్టాలు తొలిగి అంతా శుభం జరుగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇదే మంత్రాన్ని పఠించి శ్రీకృష్ణుడు .. కుబేరుడు..పఠించారని అందుకే వారు ఎలాంటి కష్టాన్ని అయినా సులువుగా ఎదుర్కున్నారని పురాణాలు చెబుతున్నారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ మంత్రం ఏమిటి.. దానిలో ఉన్న అర్దం ఏమిటో తెలుసుకుందాం. . .
దీపావళి అంటే.. లక్ష్మీ పూజ.. పటాకులు కాల్చడం.. దీపాలు వెలిగించడం.. ఇదంతా అందరికి తెలిసిందే. దీపావళి రాత్రి లక్ష్మీదేవి ప్రసన్నత కోసం ఒక ప్రత్యేక మంత్రం ఉంది . పురాణా కథల ప్రకారం .. నరకాసురుడిని.. శ్రీకృష్ణుని భార్య సత్యభామ కూడా ఇదే మంత్రాన్ని పఠించి యుద్దం చేసిన తరువాతే నరకాసురుడు హతమయ్యాడని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు.
శ్రీ కృష్ణుడు కూడ ప్రత్యేకంగా ఈ మంత్రం గురించి చెబుతారు. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలవాసిన్యై స్వాహా... ఈ మంత్రాన్ని పఠించాలి. ఎవరి ఇంటి ఆచారం పూజలు చేసుకొని.. దీపాలు వెలిగించి దీపావళి రోజు ( అక్టోబర్ 31) సాయంత్రం భక్తి శ్రద్దలతో జపం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇందులో ఐదు బీజ మంత్రాలు ఉన్నాయి. ఓం తనలో తాను పూర్ణమైన బీజ మంత్రం, అయితే శ్రీం కూడా పూర్ణమైన బీజ మంత్రం, హ్రీం కూడా బీజ మంత్రం, క్లీం మరియు ఐం ఎలాగైతే సారస్వత్య మంత్రంలో రెండు బీజ మంత్రాలు ఓం, ఐం ఉన్నాయో అవి పిల్లల జీవితంలో గొప్ప విద్యా శక్తిని వికసింప చేస్తాయి.
ఈ మంత్రం యొక్క లాభం భగవంతుడైన రాముడు.. గురుదేవుడు వశిష్ఠుడు కూడా పొందారు. ఈ మంత్రం యొక్క ప్రభావంతో శ్రీ కృష్ణుడు.. ద్వారకను... బంగారు ద్వారకగా మార్చాడని పురాణాలు చెబుతున్నాయి. రావణుడు కూడా ఇదే మంత్రంలో బంగారు లంక తయారీలో విజయం సాధించాడని.. ఈ మంత్రాన్ని పఠించే వారికి మంత్రబలంతో అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య మంత్రముతో మరియు భగవద్ ఆశ్రయం ద్వారా లక్ష్మీదేవి వస్తే ఆవిడ కమలవాషిని అవుతుంది. ఈ మంత్రంతోనే కుబేరుడు ... సంపదలు వైభవము టంకశాలపొందాడు.
విశ్వామిత్రుడు ఈ మంత్రం ద్వారా సంపదను చేజిక్కించుకున్నారు. వశిష్ఠుడు, కుబేరుడు, రావణుడు మొదలైనవారు కూడా ఈ మంత్రం మహిమను గ్రంధాలలో కొనియాడారు. ప్రత్యేకమైన ధైర్యం సాహసం ఉన్నవారు మరియు లక్ష్మిని సరిగ్గా ఉపయోగించుకునే శక్తి ఉన్నవారికి, ఈ మంత్రం కుబేరుడవ్వటానికి, కుబేరు భండారీగా మారడానికి వారి సామర్థ్యాలను పెంచుతుందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.