ఆ రోజు తిరుమలలో VIP బ్రేక్ దర్శనం రద్దు

ఆ రోజు తిరుమలలో VIP బ్రేక్ దర్శనం రద్దు

 అక్టోబ‌రు  31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేది బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది‌.

దీపావళి పండుగ రోజున వార్షిక ఆస్థానం కార్యక్రమం యొక్క సాంప్రదాయ ప్రదర్శన సందర్భంగా టీటీడీ  అక్టోబర్ 31 న బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. అక్టోబర్ 26 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన అభ్యర్థనలను స్వీకరించబోమని టీటీడీ కార్యనిర్వాహక కార్యాలయం స్పష్టం చేసింది.

Also Read :- పటాకులతో పిల్లలు జాగ్రత్త

దీపావళి పండుగ రోజు ప్రతి సంవత్సరం తిరుమలలో ఆస్థాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితి.  శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడ అధికారులు చర్యలు తీసుకున్నారు.  ప్రతిఏడాది దీపావళి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా దీపావళి ఆస్థానాన్ని ఏర్పాటు చేయనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. శాస్త్రోక్తంగా దీన్ని నిర్వహించడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టింది.