దీపావళి అంటే. వెలుగుల దివ్వెలు.. స్వీట్లు.. పసిడి కాంతులే కాదు... ఆకర్షణీయమైన గిఫ్టులు కూడా కుటుంబసభ్యులకు, బంధువులకు గిఫ్టులు ఇవ్వడం సంప్రదాయం. అందుకే గెస్టులకు ప్రత్యేక స్థానం. ఈ దీపావళికి మదిని దోచే గిఫ్ట్ ఐడియాలు మీకోసం...
హోమ్ మేడ్: సాధారణంగా గిప్టులు అనగానే మార్కెట్లో కొనో.. ఆన్లైన్ లో తెప్పించో ఇస్తుంటారు ఇస్తుంటారు చాలామంది. ఇలా కాకుండా సొంతంగా గిప్టులు తయారుచేసి ఇవ్వొచ్చు. కుటుంబసభ్యులు ఎలాంటి తీసి పదార్థాలు ఇష్టపడతారో తెలిసే ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇంట్లోనే చాక్లెట్లు, స్వీట్లు తయారుచేసి, ఆకర్షణీయమైన గిఫ్టు బాక్స్ ప్యాక్ చేసి ఇస్తే బాగుంటుంది. వీటితోపాటు గణేషుడి , లక్ష్మి దేవతామూర్తుల ప్రతిమలనూ ఇవ్పొచ్చు.
పుస్తకాలు : బెస్ట్ గిఫ్ట్ ఐటమ్స్ పుస్తకాలు ఎప్పుడూ ముందుంటాయి. ఏ జనరేషన్ అయినా పుస్తకా లు చదవడానికి ఇష్టపడతారు. ఈ దీపావళికి పుస్తకాలు కూడా బహమతిగా ఇవ్వొచ్చు. అయితే వయసునుబట్టి, ఇష్టాయిష్టాలను బట్టి పుస్తకాలను గిఫ్టులుగా ఇస్తే బాగుంటుంది. పిల్లలకు రైమ్స్ బుక్స్ తోపాటు పొయెట్రీ పుస్తకాలు ఇవ్వడం వల్ల సాహిత్య భావాలు పెంపొందుతాయి. ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా అలవాట్లు ఉంటాయి. కొందరికి పెయింటింగ్, మరికొందరికి రెసిపీ అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ల ఆసక్తులను బట్టి గిప్టులుఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
Also Read:-సారె తిరుగుతోంది కానీ.. లక్ష్మీ కటాక్షం లేదు..
నోరూరించే స్వీట్లు : పండుగ ఏదైనా సరే.. తీపి వంటకాలు ఉండాల్సిందే. స్వీట్ షాపుల్లోకు వెళ్లి ఇష్టమైన స్వీట్స్ గిప్టుగా ఇవ్వడం కామన్.. రొటీన్ కు తిన్నంగా ఒకే రకమైనవి కాకుండా... రకరకాల స్వీట్లను అందమైన అందమైన బాక్సులో నింపి ఇస్తే బాగుంటుంది.
డ్రైఫ్రూట్స్: దీపావళి గిఫ్ట్ ఇది. స్వీట్లకు బదులు డై ఫ్రూట్ ఇప్పడం వల్ల ఎక్కువ కాలం నిల్వ దేసుకోవచ్చు. డ్రైఫ్రూట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధకశక్తిని పెంచడంతోపాటు
నాణేలు: బెస్ట్ దీపావళి గిఫ్ట్ ఇది. స్వీట్లకు బదులు డై ఫ్రూట్ ఇప్పడం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. డ్రైఫ్రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధకశక్తిని పెంచడంతోపాటు బరువునూ తగ్గిస్తాయి.
గోల్డెన్ గిఫ్ట్స్: బంగారు ఆభరణాలనుఇష్టపడనివాళ్లు ఎవరూ ఉండరు. పైగా పండుగకు బంగారం కొనడం కూడా సంప్రదాయం. కాబట్టి ఇష్టమైనవాళ్లకు బంగారు ఆభరణాలతో కూడిన గిప్టు లు ఇస్తే.. ఆనందాన్ని రెట్టింపు చేయొచ్చు. నెక్లెస్, బ్రాస్ లెట్, బ్యాంగిల్స్, వజ్రాలు.. లాంటివి. ఇవ్వొచ్చు. అయితే బడ్జెట్ ను బట్టి గిఫ్టులు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
బంగారు, వెండి నాణేలు: ఆభరణాలు కొనాలంటే ఖర్చుతో కూడు కున్న పని. అందుకు బదులుగా బంగారు. వెండి నాణేలను గిఫ్టుగా ఇస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. లక్ష్మీ దేవత ప్రతిమలతో కూడిన నాణేలు ఇస్తే బాగుంటుంది. కొన్ని కుటుంబాల్లో ఈ రకమైన గిప్టులకు చాలా ప్రాధాన్యం ఇస్తారు.. వారసత్వంగా కూడా ఇలాంటి గిఫ్టులు ఇస్తుంటారు
దేవుళ్ల ప్రతిమలు : కుటుంబసభ్యుల్లో, ఆత్మీయుల్లో పెద్దవాళ్లు కూడా ఉంటారు. వాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి గిప్టులు ఇవ్వాలి. సాధారణంగా పెద్దవాళ్లు స్వీట్లు, ఇతర గిఫ్టులు తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ల అభిరుచులేంటో తెలుసుకోవాలి. చాలామంది దేవుడి ప్రతిమలు తీసుకోవడానికి ఇష్టపడతారు. చిన్న సైజులో వెండి.... లేదా బంగారంతో కూడిన ప్రతిమలు ఇస్తే బాగుంటుంది. లార్డ్ గణేషా తిరుపతి వెంక టేశ్వరస్వామి, లక్ష్మీ దేవికి సంబంధించిన చిన్నపాటి విగ్రహాలను అందిస్తే మరింత ఆనందిస్తారు.
–వెలుగు, లైఫ్–