దీపావళి వేడుకలపై గతంలో సుప్రీంకోర్టు ఆంక్షలు ఉన్నాయి. రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరక బాణసంచా కాల్చాలని అది కూడా తక్కువ కాలువ్యం వచ్చే గ్రీన్ క్రాకర్స్ (హరిత పటాకులు) వాడాలని సూచించింది. అంతా బాగుంది కానీ.అసలు గ్రీన్ క్రాకర్స్ ఎవరు తయారు. చేస్తున్నారు..? ఎక్కడ దొరుకుతాయి?. అనే దానిపైనే ఇప్పుడు చర్చంతా దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. అదే సమయంలో గ్రీన్ క్రాకర్స్ తయారు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్- అండ్ ఇండస్టీ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అదేశాలు జారీ చేసింది. దీంతో కాలుష్య రహిత పటాకుల ఫార్ములా సిద్ధమైంది..
గ్రీన్ కాకర్స్ చూడటానికి మామూలు పటాకుల్లానే ఉంటాయి. కానీ, వాటి నుంచి. వచ్చే పొగ, శబ్దాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం వాడే పటాకులు ఎక్కువ స్థాయిలో నైట్రోజన్, సల్ఫర్ వాయువులు విడుదల చేస్తాయి. అదే గ్రీన్ క్రాకర్స్ లో అయితే వాయువులు నలభై నుంచి యాభై శాతం వరకు తక్కువ ఉంటాయట. వీటిలో అంటిమోనీ, లిథియమ్, మెర్క్యురీ, ఆర్సనిక్, టెడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉపయోగించరు. ఈ పటాకుల తయారీ కోసం ప్రత్యేకమైన పదార్థాలు వినియోగిస్తారు. అంతేకాదు ఇవి రంగు రంగుల మెరుపులను వెదజల్లుతాయి. వీటిలో కూడా సేఫ్ వాటర్ రిలీజర్స్ (నీరు విడుదల చేసేవి), సేఫ్ మినిమల్ అల్యూమినియం (అల్యూమినియం తక్కువ ఉపయోగించేవి), సేఫ్ థెర్మైట్ క్రాకర్స్ ఆరోమా పటాకులు లాంటి రకాలున్నాయి. నిజానికి ఇలాంటి క్వాలిటీలున్న క్రాకర్స్ తయారీ అసాధ్యం కానీ, ఇలాంటి పటాకులు తయారు చేసేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ దృష్టిపెట్టింది. అంతే కాకుండా మామూలు బాణసంచాతో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ ధరలు తక్కువగా ఉంటాయంట. ప్రస్తుతం కొన్ని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ పటాకులను తయారు చేసేందుకు పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లాజివ్స్కు సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి ముందుగా అనుమతి రావాల్సి ఉంది. ఆ తర్వాత సీఎస్ఐఆర్ కు చెందిన నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సంస్థ గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తుంది. కన్వెన్షనల్ క్రాకర్స్ కు బదులు గ్రీన్ క్రాకర్స్ పై ప్రజలకు అవగాహన ఆసక్తి కలిగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి ఉంది. మరో వైపు ప్రపంచంలో ఎక్కడా హరిత పటాకుల వినియోగం లేదని మన దేశంలోనే పుట్టిందని సైంటిస్టులు చెబుతున్నారు.
ALSO READ : Diwali 2024 : దీపావళి పండుగ అన్ని మతాల వారిదీ.. ఒక్కో మతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు..!
అస్సాంలో 1301 ఏళ్ల నుంచే..
అస్సాంలోని గనక్కుకి అనే గ్రామంలో 1885 నుంచి గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తున్నారు. ఈ బాణసంచాను కాలిస్తే తక్కువ శబ్దంతో పాటు పొగ, కెమికల్స్ చాలా తక్కువ స్థాయిలో విడుదలవుతాయని అక్కడి తయారీదారులు చెప్పున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి కాకుండా పర్యావరణానికి పెద్దగా హాని జరగరంబు. అయితే, ప్రస్తుతం ఈ గ్రీన్ క్రాకర్స్ ను మిషన్స్ తో కాకుండా మనుషులే తయారు చేస్తున్నారు. మేము తయారు చేసే బాణసంచా గ్రీస్ క్రాకర్స్ లాంటివే. వాటిల్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా తక్కువగా ఉంటాయి. మా ప్రాడక్ట్స్ శాస్త్రవేత్తలు పరీక్షిస్తే ఎంత వరకూ రసాయనాలు వాడామనే విషయం తెలుస్తుందనిగ్రీన్ కాకర్స్ తయారీ దారులు అంటున్నారు ....