Diwali 2024: దీపావళి.. లక్ష్మీ గణపతి పూజకి.. నైవేద్యాలు ఇవే..

Diwali 2024: దీపావళి.. లక్ష్మీ గణపతి పూజకి.. నైవేద్యాలు ఇవే..

దీపావళి హిందువులకు అతి పెద్ద పండుగ.  చెడుపై మంచి విజయం సాధించిన రోజని పురాణాలు చెబుతున్నాయి.  అయితే దీపావళి పండుగ రోజున చాలామంది లక్ష్మీ దేవిని.. వినాయకుడిని పూజిస్తారు.  అయితే లక్ష్మీ గణపతిని ప్రసన్నం చేసుకునేందుకు  కొన్ని ప్రత్యేక వస్తువులు సమర్పించడం శుభప్రదం. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

దీపావళి భారతదేశంలోని అతిపెద్ద పండగ. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీనిని దీపాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున ఇంటిలో దీపాలు వెలిగిస్తారు. చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం.. చీకటిని తొలగించి, కాంతికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. పవిత్రమైన దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు. అంతేకాదు పూజ అనంతరం ఆహారాన్ని సమర్పిస్తారు. దీపావళి రోజున అన్న వితరణ చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారని ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

Also Read :-  దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులు ఎలాంటివి కోరుకుంటున్నారు అంటే..!

దీపావళి పండగ సమయంలో లక్ష్మీదేవి గణపతిలను పూజిస్తే  సంతోష పడతారని.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందని నమ్మకం.  ఎవరైనా ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి, గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలని కోరుకుంటారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవి, గణేష్‌లకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాలనే నియమం ఉంది. 

లక్ష్మీ దేవి, గణేశునికి ఏమి సమర్పించాలంటే

  • స్వీట్లు: మోతీచూర్ లడ్డూలు, గులాబ్ జామూన్, బర్ఫీ, కోవా మొదలైన తీపి పదార్థాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. ఇవి కాకుండా పండ్లు, కొబ్బరి, తమలపాకులను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.
  •  పాలు, స్వీట్లను నైవేద్యంగా పెట్టడం కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. కుంకుమపువ్వును పాలలో కలిపి సమర్పించవచ్చు.
  •  పూల్ మఖానా సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అందువల్ల దీపావళి రోజున పూల్ మఖానాను లక్ష్మీదేవికి అందించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  •  సీతాఫలం సంపద , శ్రేయస్సు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. దీనిని లక్ష్మీదేవికి సమర్పించవచ్చు.
  • అరటిపండును  శుభప్రదమైన ఫలంగా పరిగణిస్తారు. దీనిని వినాయకునికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
  • శనగపిండి లడ్డు ...గణేశుడికి మోదకం లేదా శనగపిండి లడ్డూలంటే చాలా ఇష్టం. వీటిని నైవేద్యంలో చేర్చడం శుభప్రదంగా భావిస్తారు.