మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్తర్ పూర్ జిల్లాలో దీపేందర్ యాదవ్ అనే ఐదేళ్ల బాలుడు బోరు బావిలో పడ్డ విషయం తెలిసిందే. రెస్క్యూ టీం బాలుడు సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. ఆ బాలుడిని వేంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతున్న దీపేందర్ యాదవ్ బాగానే ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. అతను 24 గంటల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతాడని సివిల్ సర్జన్ డాక్టర్ జెఎల్ అహిర్వార్ తెలిపారు.
Madhya Pradesh | The 5-year-old boy who fell into the borewell in Chhattarpur, earlier today, was safely rescued and is alive. He is being taken to the hospital: CMO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 29, 2022
(Pic source: CMO) https://t.co/N6tzeqtdgv pic.twitter.com/eFpF4LycSI
బాలుడిని రక్షించేందుకు బోరు బావికి సమాంతరంగా సొరంగం తవ్వారు. దాదాపు 30 ఫీట్ల లోతులో బాలుడున్నట్లు గుర్తించిన అధికారులు.. అతనికి ఆక్సిజన్ అందించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం SDERF బృందంతో పాటు పోలీసులు, వైద్యులు సంఘటనాస్థలంలో ఉన్నారు. సాగర్, జబల్బూర్, గ్వాలియర్ నుంచి మొత్తం 27 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చివరకు ఆ ప్రాణాలతో బాలుడిని రక్షించారు.
మళ్లీ బోరు బావి ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నారులు అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతమంది చిన్నారులు బలైపోతున్నా.. ప్రజలు మేల్కోవడం లేదు. బోరు వేసిన తర్వాత.. నీరు రాకపోతే.. వెంటనే దానిని మూసివేయాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొంతమంది పట్టించుకోవడం లేదు. దీంతో నూరేళ్ల పాటు బతకాల్సిన చిన్నారులు.. మధ్యలోనే అనంతలోకాలకి వెళ్లిపోతున్నారు. ఇటీవలే గుజరాత్ రాష్ట్రంలో రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం విచారకరం.
Madhya Pradesh | 5-year-old Deepender Yadav who was safely rescued from a borewell in Chhattarpur is doing fine. He will be discharged from the hospital after 24 hours, said Civil Surgeon JL Ahirwar (29.06) pic.twitter.com/yGHkSxPROB
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 29, 2022