ఆన్‌లైన్‌లో పబ్జీ ఆడుతూ ప్రేమలో పడ్డ సీమా హైదర్, సచిన్ మీనా జంట గతంలో సంచలనం సృష్టించింది. సీమా హైదర్ పాకిస్థానీ వివాహిత, పిల్లలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సచిన్ అనే యువకుడితో పబ్జీ ఆడుతూ ప్రేమలో పడింది. పాకిస్థాన్‌లో తన భర్తని వదిలేని ఇండియాకు వచ్చి మతం మారి సచిన్ ను మళ్లీ పెళ్లి చేసుకుంది. అయితే ఇటీవలె సీమా, సచిన్ ల మధ్య గొడవలు అవుతున్నాయని వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే సీమా హైదర్ మొఖంపై గాయాలతో తన ఉన్న ఓ వీడియో వైరల్‌గా మారింది. సీమా హైదర్ ను తన భర్త సచిన్ చిత్ర హింసలు పెడుతున్నాడని.. వారి మధ్య గొడవలు అవుతున్నాయని, తరుచూ కొడుతున్నాడని చెప్పుతున్న ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె కన్ను, పెదాలకు, మొఖంపై గాయాలను చూపిస్తోంది.
Seema Haider :
— Tricity Today (@tricitytoday) April 8, 2024
ग्रेटर नोएडा में पाकिस्तानी भाभी को किसने पीटा! गहरे चोट के वीडियो वायरल #seemahaider #GreaterNoida pic.twitter.com/3VacA4dCoH
ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పోలీసులు సీమా హైదర్ ను సంప్రదించగా.. ఆ వీడియోలో ఉంది తాను కాదని ఆమె ఫేస్ తో ఎవరో డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేశారని సీమా చెప్పింది. డీప్‌ఫేక్ పై సీమా స్పందిస్తూ వారి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని.. సచిన్ ఆమెని కొట్టి, చిత్రహింసలు పెట్టలేదని తేల్చి చెప్పింది. వారి మధ్య అంతా సవ్యంగా ఉందని చెప్పింది. ఆ వీడియో కావాలనే పాకిస్థాన్ లో కొందమంది క్రియేట్ చేశారని ఆరోపించింది. పాకిస్థాన్ లో యూటూబ్ లో ప్రచారం చేస్తున్నారని చెప్తూ ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
सीमा हैदर के साथ हुई मारपीट का वीडियो वायरल, सीमा हैदर ने वीडियो को बताया फेक।#seemahaider pic.twitter.com/A847R1TwVA
— Raajeev Chopra (@Raajeev_Chopra) April 8, 2024