AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. టెక్నాలజీ రంగంలో విప్లవం అని చెప్పాలి. దీనికి రెండు వైపుల పదును ఉంది. మంచికి ఉపయోగిస్తే పర్వాలేదు.. అదే మరోవైపు ఏఐని ఉపయోగిస్తే.. ఎంత ప్రమాదమో.. ఎలాంటి వీడియోలు బయటకు వస్తాయో.. ఎంత డేంజర్ అనేది హీరోయిన్ రష్మిక విషయంలో తేలిపోయింది.
రష్మిక అశ్లీల వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రష్మిక లిఫ్ట్ నుంచి బయటకు రావటం.. అశ్లీలంగా ఉండటంతో.. నెటిజన్లు అందరూ ఈ వీడియో నిజమే అనుకున్నారు. రష్మిక కాదు అంటే ఎవరూ నమ్మే పరిస్థితి కూడా లేదు. నెటిజన్లు అందరూ ఇది రష్మిక లేటెస్ట్ వీడియో అని షేర్లు చేశారు.. స్టోరీలు రాశారు.. వాస్తవంగా ఆ యువతి ఆంగ్లో ఇండియన్ మోడల్ జారా పటేల్ ది..
Also Read :- రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్
తీరా నిజం ఏంటీ అంటే.. అది డీప్ ఫేక్ వీడియో.. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేశారు. సోషల్ మీడియాలో ఓ మహిళ పాత వీడియోకు.. రష్మిక ముఖాన్ని మార్చారు. ఇప్పటి వరకు ఫొటోలు.. ఇమేజ్ వరకు మాత్రమే పరిమితం అయిన డీప్ ఫేక్ ఫొటోలు.. ఇప్పుడు వీడియోలకు వచ్చింది. ఈ డీప్ ఫేక్ వీడియోను.. AI టూల్స్ ఉపయోగించి చేసినట్లు చెబుుతున్నారు టెక్ నిపుణులు. ఇన్ స్టాలోని మోడల్ జారా పటేల్ వీడియోను.. AI టూల్స్ ఉపయోగించి.. రష్మిక ముఖాన్ని పెట్టారు. ఇది ఎంతలా అంటే.. నిజంగానే రష్మికనా అనేంతగా.. ఏ మాత్రం అనుమానం రానంతగా.. ఇంత డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో తయారు చేయటం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారానే ఇది సాధ్యం అయ్యిందనేది ఇప్పుడు స్పష్టం అయ్యింది.
రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. నిందితులను గుర్తించే పనిలో ఉంది. అంతే కాకుండా టెక్ కంపెనీలు, క్రియేటర్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలోకి రాకుండా కట్టడి చేయాలని ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్ట్రా, యూట్యూబ్ లను కోరింది. రష్మిక వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే.. రాబోయే రోజుల్లో మరిన్ని వస్తాయని భయపడుతుంది కేంద్రం. అదే విధంగా దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలు రష్మిక డీప్ ఫేక్ వీడియోపై స్పందించాయి. వెంటనే చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. వార్నింగ్ గట్టిగా లేకపోతే ఆన్ లైన్ క్రియేటర్లు మరింత రెచ్చిపోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారు అందరూ..
AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత డేంజరో.. ఎంత ప్రమాదకరంగా మారబోతున్నాయి అనటానికి రష్మిక డీప్ ఫేక్ వీడియోనే సాక్ష్యం.. బీ కేర్ ఫుల్.. టెక్నాలజీ ఆపటం కష్టం.. క్రియేటర్లను కట్టడి చేయటం కొంచెం వరకు ఈజీ కదా...