అందం, అభినయం, అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని, బాలీవుడ్ స్టార్ కథానాయికల జాబితాలో చేరిపోయిన దీపికా పదుకునే ఇటీవల ప్రారంభమైన కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిన విషయం తెలిసిందే. మామూలుగానే తన హావభావాలతో, కట్టిపడే కళ్లతో ఆకర్షించే గుణం ఉన్న దీపికా.. తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంటు ముగింపు వేడుకల్లో పాల్గొన్న పికూ స్టార్ దీపికా భారతీయ వస్త్రధారణలో అందర్నీ ఆకర్షించింది.
తెల్లని రఫుల్ చీర కట్టులో షో చేస్తూ... దానిపైకి ఇంపుగా ఉండే ముత్యాల నెక్లెస్ తో పాటు గుండ్రని స్టడ్ చెవి దిద్దులు పెట్టుకొని ఫెస్టివల్ మూడ్ కి మరో కొత్త అందాన్ని తీసుకొచ్చింది. స్టన్నింగ్ లుక్ లో గాంభీర్యం వెదజల్లుతున్నట్లుగా కనిపించే దీపికా అందాన్ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. చాలా చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. దీపికా అగ్ర హీరోలతో నటిస్తూ రోజురోజుకూ తన ఇమేజ్ ను పెంచుకుంటూ పోతుంది. అందులో ముఖ్యంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లతో ప్రాజెక్ట్ కె మూవీ ద్వారా స్ర్కీన్ ను షేర్ చేసుకోబోతుంది. పఠాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహాంలతోనూ నటిస్తోందని సమాచారం.
మరిన్ని వార్తల కోసం..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు
యూపీలో మహిళా కార్మికులకు కొత్త రూల్స్