నార్త్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా మారిపోయింది.
రణ్‌వీర్ సింగ్, దీపికా 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది (2024) సెప్టెంబర్లో తమ తొలి సంతానాన్ని పొందబోతున్నట్లు వాళ్లు మూడు నెలల కిందట సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత మూడు నెలలుగా దీపికా తన ఫొటోలను ఫిల్మ్ ఫెస్టివల్, సినిమా ఈవెంట్స్ లలో అప్‌లోడ్ చేస్తూనే ఉంది.
అయితే వాటిలో ఎక్కడా తన బేబీ బంప్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. ఇటీవల అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడకకు వచ్చినా కూడా అక్కడా కెమెరాలకు కనిపించకుండా జాగ్రత్త పడింది. మొత్తానికి సోమవారం (మే 20) ముంబైలో లోక్‌సభ ఐదో విడత ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన సమయంలో దీపికా పదుకోన్ గర్భం స్పష్టంగా కనిపించింది.
ఇక్కడ దీపికా పదుకొణె భర్త రణవీర్ సింగ్ తో కలిసి ఓటేసేందుకు పోలింగ్ బూత్ కి వచ్చింది. రణవీర్ తన భార్యని ఎంతో జాగ్రత్తగా బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటేయించాడు.ఇక వాళ్ల రాక గుర్తించిన మీడియా కవర్ చేస్తూ..ఫొటోస్ వీడియోస్ తీశారు.ఇందులో దీపిక శరీరానికి ఎంతో సౌకర్యంగా ఉండే వైట్ కలర్ షర్ట్ లో లైట్ బ్లూ జీన్స్ ధరించింది. అయితే దీపిక పొట్ట భాగం మునుపటి కంటే బాగా ఎత్తుగా మారింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దీపికా పదుకునే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన దీపిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీపికకి పండంటి బిడ్డ పుట్టాలంటూ మెసేజెస్ ల ద్వారా కోరుకుంటున్నారు.
ఇక దీపికా ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్టులలో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 AD మూవీ ఒకటి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. కల్కి సినిమా కోసం దీపికా ఏకంగా రూ.20 కోట్లు పోరితోషికంగా అందుకుంటుందట.
గతంలో ఒక్కో సినిమాకు రూ.12 నుండి రూ.15 కోట్ల వరకు తీసుకున్న దీపికా.. కల్కి కోసం రూ.20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. హిందీలో ‘సింగమ్ రిటర్న్స్’ సినిమాల్లో చేస్తూనే..మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేసింది.