DeepikaPadukone: లేడీ సింగం వచ్చేసింది.. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో దీపిక అదరగొట్టేసింది

DeepikaPadukone: లేడీ సింగం వచ్చేసింది.. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో దీపిక అదరగొట్టేసింది

తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు ‘సింగం’ సిరీస్‌‌‌‌ ఎంతటి విజయాలను ఇచ్చిందో.. హిందీ ‘సింగం’ సిరీస్ అజయ్ దేవగన్‌‌‌‌కు అంతే సక్సెస్‌‌‌‌ను ఇచ్చింది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో సింగం, సింగం రిటర్న్స్‌‌‌‌ చిత్రాలు తీసి అజయ్‌‌‌‌కు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి.. ఇప్పుడు అతనితో మూడో సినిమా చేయబోతున్నాడు. 

‘సింగం ఎగైన్‌‌‌‌’ (Singham Again)టైటిల్‌‌‌‌తో వస్తోన్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె(Deepika padukone) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సింగం ఎగైన్‌‌‌‌ ట్రైలర్ రిలీజ్ చేయగా.. యూట్యూబ్లో దుమ్మురేపుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. దాదాపు 4.58 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌ డైరెక్టర్ రోహిత్‌ మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఆక్టటుకునేలా సాగింది. 

ఈ పవర్-ప్యాక్డ్ కాప్ డ్రామా ట్రైలర్లో దీపికా లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా అదరగొట్టేసింది. రౌడీ నోట్లో గన్ను పెట్టి నవ్వుతూ ఉన్న ఉన్న దీపిక పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఓ వైపు పోలీస్ గెటప్ లో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తూనే.. తనదైన అల్లరిని చూపించింది. జస్ట్ ట్రైలర్ ఈ రేంజ్‌లో ఉదంటే.. ఇక సినిమాలో దీపిక క్యారెక్టర్‌ను ఏ రేంజ్‌లో ఉండబోతుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ | Suriya44: క్రేజీ కాంబో.. కార్తీక్ సుబ్బరాజు-సూర్య‌ మూవీ అప్డేట్

ప్రస్తుతం దీపికకు సంబందించిన ట్రైలర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకోనుందో చూడాలి. 

‘సూర్యవన్షీ’ మూవీ క్లైమాక్స్‌‌‌‌లో ఓ టెర్రరిస్ట్ కోసం ‘భాజీరావు సింగం’ పాకిస్తాన్ వెళ్తున్నట్లు చూపించి ‘సింగం ఎగైన్‌‌‌‌’కి లీడ్‌‌‌‌ ఇచ్చాడు రోహిత్ శెట్టి. దీంతో పాకిస్తాన్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే సింగం అగైన్ మూవీలో కరీనా కపూర్,రణ్‍వీర్ సింగ్ కూడా క్యామియో రోల్స్‌లో కనిపించనున్నారు. టైగార్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, దయానంద్ శెట్టి, శ్వేతా తివారీ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ దీపావళి సందర్బంగా నవంబర్‌ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.