బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆదివారం ( సెప్టెంబర్ 8, 2024 ) ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు దీపికా. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని, శుభవార్తతో తమ కుటుంబంలో ఆనందం నెలకొందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో దీపిక రణ్వీర్ దంపతులకు కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తున్నారు నెటిజన్స్.
రామ్ లీలా సినిమాలో తొలిసారి కలిసి నటించిన దీపికా, రణ్వీర్ లు షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. తర్వాత 2018లో ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. దీపికా ఇటీవల కల్కి 2898 AD సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోగా రణ్వీర్ ప్రస్తుతం సింగం అగైన్ సినిమాలో నటిస్తున్నారు.