ఎంప్లాయీస్ పనిదినాలపై ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ ఎంఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదివారం తో సహా వారంలో 90 గంటలు పనిచేయాలని సూచిం చడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రముఖ సిని నటి దీపికా పదుకొణె కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఉద్యోగుల పని దినాల విషయంలో గతంలో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ కూడా పనిగంటల అంశంపై ఇలాంటి వ్యాఖ్యాలు చేశారు.
ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ ఎంఎన్ సుబ్రమణియన్ ఉద్యోగులతో మాట్లాడుతూ..వారానికి 90 గంటల పనిచేయాలి.. ఆదివారాల్లో కూడా పనిచేయాలని చెప్పారు.. ఎంతసేపు ఇంట్లో భార్య మొహం,భర్తల మొహం చూసుకుంటూ కూర్చుంటారు.. మేం ఆదివారాల్లో కూడా పనిచేస్తున్నాం కదా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుబ్రమణియన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హాట్ టాపిక్ గా మారింది.
దీపికా పదుకొణె.. ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ..
ఎల్ ఎన్ టీ సంస్థ చైర్మన్ ఎంఎన్ సుబ్రమణియన్ వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ సినీ నటీ దీపికా పదుకొణే స్పందించారు. ఎల్ అండ్ టీ సంస్థ నిర్మాణ రంగంలో గొప్ప సంస్థ.. అది మేం కాదనడం లేదు.. కానీ ఓ మంచి పొషిషన్ లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా ఉద్యోగుల మెంటల్ హెల్త్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది.