దీపిక కోసం ప్రభాస్ భారీ లంచ్‌‌‌‌‌‌‌‌

 దీపిక కోసం ప్రభాస్ భారీ లంచ్‌‌‌‌‌‌‌‌

ప్రభాస్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’తో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఇస్తోంది దీపికా పదుకొనె. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దీని కోసం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ స్పెషల్ సెట్‌‌‌‌‌‌‌‌ వేశారు. ఇటీవల షూటింగ్‌‌‌‌‌‌‌‌లో జాయినయిన దీపిక ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని తిరిగి ముంబై వెళ్లిపోయింది. ‘83’ మూవీ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ప్రాజెక్ట్ కె’ గురించి మాట్లాడింది. షూటింగ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆమెకి అదో  సరికొత్త మాయా ప్రపంచంలా, విజువల్ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా అనిపించిందట. హిందీ కాకుండా మరో భాషలో నటిస్తుండడం, వీఎఫ్‌‌‌‌‌‌‌‌ఎక్స్ సినిమా కావడం, కొత్త తరహా క్యారెక్టర్ లాంటివన్నీ ఆమెను భయపెట్టేశాయట. అందుకే కొంత నెర్వస్‌‌‌‌‌‌‌‌గా ఫీలయ్యానని.. అదే సమయంలో సినిమాపై  క్యూరియస్‌‌‌‌‌‌‌‌గాను, ఎక్సైటింగ్‌‌‌‌‌‌‌‌గాను ఉన్నానని కూడా చెప్పింది. ఇక ప్రభాస్ గురించి చెబుతూ ‘తను చాలా కామ్‌‌‌‌‌‌‌‌గా ఉంటాడు కనుక మేమిద్దరం అంతగా మాట్లాడుకోలేదు. ప్రభాస్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌కి వచ్చినట్టు కూడా చాలామందికి తెలీదు. ప్రశాంతంగా ఓ మూల కూర్చుని షూటింగ్‌‌‌‌‌‌‌‌ని గమనిస్తూ ఉంటారు’ అంది దీపిక. షూటింగ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో దీపిక కోసం భారీ లంచ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశాడు ప్రభాస్. ఆ ఐటమ్స్‌‌‌‌‌‌‌‌ను చూసి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌ అయిన దీపిక ఆ విషయాన్ని ఇన్‌‌‌‌‌‌‌‌స్టా స్టోరీస్‌‌‌‌‌‌‌‌లో పంచుకుంది. మరోవైపు ‘83’ మూవీ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌ కోసం రణవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌తో కలిసి తెలుగు బిగ్‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌ షోకి రానుందట దీపిక. గ్రాండ్‌‌‌‌‌‌‌‌ ఫినాలేకి ఈ జంట స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలవనుందని  టాక్. ఈ సినిమాని తెలుగులో నాగార్జున విడుదల చేస్తుండడంతో ఈ న్యూస్ నిజమయ్యే చాన్సెస్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగానే ఉన్నాయి.