Deepika Padukone: హిట్ జోడీ రిపీట్.. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ తల్లిగా దీపికా పదుకొనే!

Deepika Padukone: హిట్ జోడీ రిపీట్.. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ తల్లిగా దీపికా పదుకొనే!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 2023లో వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో కనిపించి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. 'పఠాన్', 'జవాన్' మరియు 'డుంకీ' సినిమాలు రికార్డ్స్ వేటలో తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేశాయి.

ప్రస్తుతం షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో 'కింగ్' అనే మూవీలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ కింగ్ మూవీ అప్డేట్ ఒకటి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్లో ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాలో సుహానా ఖాన్ తల్లిగా దీపికా పదుకొనే నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ హిట్ జోడీల్లో షారుక్, దీపికా పదుకొణెల జంట ఎంతో ప్రత్యేకం. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 6 సినిమాలొచ్చాయి.

అందులో ‘ఓం శాంతి ఓం’,‘చెన్నై ఎక్స్ ప్రెస్’,‘పఠాన్’,‘జవాన్’లాంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. అయితే, కింగ్ మూవీలో దీపికా జస్ట్ అతిధి పాత్రలో నటించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. అంతేకాకుండా షారుఖ్ మాజీ ప్రేయసిగా కనిస్తోందని కూడా మాట్లాడుకుంటున్నారు. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. అలాగే, 2026లో YRF సంస్థ నిర్మిస్తున్న 'పఠాన్ 2'లో షారుక్, దీపికా మళ్లీ కలిసి నటించే అవకాశం ఉంది.

ఇకపోతే, అట్లీ తెరకెక్కించిన జవాన్ (2023)లో షారుఖ్‌కు తల్లిగా దీపిక నటించగా, బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ (2022)లో ప్రత్యేక పాత్ర పోషించింది. ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి 2898 AD(2024)లో సైతం కల్కికి తల్లిగా ఆమె నటించింది. ఇలా వరుస కీలక పాత్రలు పోషిస్తూ తన స్టార్ డమ్ను చాటుకుంటుంది.