
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్‌ల గారాల పట్టి ‘దువా’ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన కూతురిని దీపికా ఆప్యాయంగా ఎత్తుకున్న పిక్స్ నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలు చూసి దీపికా, రణ్ వీర్ సింగ్‌ల ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ‘దువా’ చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్‌ల జోడి ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడ తమ పాప ఫొటోలను షేర్ చేయలేదు. అలాగే.. బయటకు వెళ్లినప్పుడు కూడా మీడియా, ఫొటో గ్రాఫర్ల కంట పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.
అయినప్పటికీ దువా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలకు గౌరవం ఇవ్వాలని.. ఇలా వారిని ఇబ్బంది పెట్టొద్దని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దీపికా, ఆమె కూతురు దువా పిక్స్ ఫేక్ అని తేలింది. నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఫొటోలు ఏఐ టెక్నాలజీతో రూపొందించినవని తేలింది. ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఫొటోలు.. నిజమైనా పిక్స్ లాగే ఉన్నాయి. ఈ ఫొటోల్లో దీపికా, దువా చాలా క్యూట్‌గా ఉన్నారు.
ఇవి నిజమైన ఫొటోలే అనుకుని దీపికా, రణ్‌వీర్ ఫ్యాన్స్ పిక్స్‌ను షేర్ చేస్తున్నారు. ఏదేమైనా దీపికా, రణవీర్‌ల కూతురు చాలా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక, రణ్‌వీర్ 2018 నవంబర్ 14 మరియు 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8, 2024న దీపికా పదుకొనే రణవీర్‌ల జోడికి దువా జన్మించింది. దువా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాపకు సంబంధించిన ఫొటోలను బయటకు విడుదల చేయలేదు. దువా పాదాల ఫొటోను మాత్రమే ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్తి ముఖాన్ని ఇప్పటి వరకు చూపించలేదు.