న్యూఢిల్లీ: రష్యాను ఆపగలిగే శక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉందని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా అన్నారు. మోడీ లాంటి బలమైన నేత మాట్లాడితే యుద్ధం గురించి పుతిన్ పునరాలోచిస్తారని పొలిఖా చెప్పారు. భారత్ బలమైన దేశమని, ప్రపంచ యవనికపై శక్తిమంతంగా మారుతోందన్నారు. అలాంటి దేశం రష్యా, ఉక్రెయిన్ వార్ ను ఆపేందుకు తీసుకుంటున్న చర్యలు సరిగ్గా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో ఉన్న భారత్ పౌరులను ఉద్దేశించి మోడీ సర్కారు విడుదల చేసిన ప్రకటనపై పొలిఖా అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ చెబుతోందని.. ఇది సరికాదన్నారు.
#WATCH | Delhi: Dr Igor Polikha, Ambassador of Ukraine to India seeks Government of India's intervention amid #RussiaUkraineConflict; urges PM Narendra Modi to speak with Russian President Vladimir Putin. pic.twitter.com/L1b48I42DN
— ANI (@ANI) February 24, 2022
ఇప్పటికే ఉక్రెయిన్ లో 50 మంది పౌరులు చనిపోయారని.. వందలాది, వేలాది మంది చనిపోయే దాకా ఇలాగే గమనిస్తూ ఉంటారా అని పొలిఖా ప్రశ్నించారు. ‘ఈ విపత్తు సమయంలో భారత ప్రభుత్వం మాకు మద్దతుగా ఉంటుందని భావిస్తున్నాం. ఇది న్యాయానికి సంబంధించిన అంశం. భారత సాయాన్ని కోరుతున్నాం. వారి మద్దతు కోసం ఎదురు చూస్తున్నాం. ప్రపంచంలో బలమైన నేతల్లో మోడీ ఒకరు. ప్రపంచ స్థాయి నాయకుల్లో ఎవరి మాటను పుతిన్ వింటారో మాకు తెలియదు. కానీ ఈ సమస్య గురించి మోడీ చెబితే మాత్రం పుతిన్ వింటారు. మోడీ మాట్లాడితే పుతిన్ తప్పకుండా ఆలోచిస్తారు. తక్షణమో రష్యాతో భారత ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టాలి’ అని పొలిఖా పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం..