సత్తుపల్లి, వెలుగు: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తామని స్పష్టం చేశారు. శనివారం సత్తుపల్లి పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తుమ్మలను పరోక్షంగా విమర్శించడం తమను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. జిల్లాలో బీఆర్ఎస్బలోపేతానికి తుమ్మలను వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ను వీడిన వారిలో బేతపల్లి సర్పంచ్ పాకలపాటి శ్రీనివాసరావు, యాతాలకుంట ఉప సర్పంచ్ వెచ్చా రాంప్రసాద్, సొసైటీ చైర్మన్ దిరిశాల నరసింహారావు, నాయకులు గాదె సత్యం, కొత్తూరు ప్రభాకరరావు, డా.నరసింహారావు, చల్లగుళ్ల నరసింహారావు, బండి గురునాథరెడ్డి, పోట్రు సత్యం, రాచూరి గంగరాజు, సీతారామారావు, గొర్ల రామ్మోహన్ రెడ్డి, కొప్పుల నరేందర్ రెడ్డి, కొప్పుల ప్రవీణ్, కిలారి వెంకటేశ్వరరావు, అంజిరెడ్డి, జగన్నాథం, వెల్ది జగన్మోహనరావు, కోటేశ్వరరావు, రవి, సాంబయ్య, కరుణాకర్, వెంకటయ్య, షరీఫ్, కృష్ణారావు, నాగబాబు, ప్రభాకరరావు, ములకలపాటి విష్ణు, దేవగిరి అప్పిరెడ్డి, మధు, పుసులూరి హనుమంతుతోపాటు మరి కొంతమంది ఉన్నారు.