బ్రేకప్ చెప్పిన దీప్తి సునైనా.. స్పందించిన షణ్ముఖ్

సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించిన, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు. వ్యక్తిగత కారణాలతో షణ్ముఖ్ తో  తమ ఐదేళ్ల బంధానికి బ్రేకప్  చెబుతున్నానంటూ దీప్తి సునైనా తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. తమ దారులు వేరని.. పరస్పర అంగీకారంతో ఇద్దరం విడిపోతున్నామని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో  మాకు మీ అండ అవసరమని..దయచేసి తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని కోరింది.

అయితే బ్రేకప్ పై స్పందించిన షణ్ముఖ్.. ఆ నిర్ణయం తీసుకోవడానిక దీప్తి సునైనాకు అన్నిహక్కులున్నాయని అన్నాడు. ఆమె ఇప్పటి వరకు చాలా ఫేస్ చేసిందని....ఇప్పటికైనా సంతోషంగా ఉండాలని కోరకుంటున్నట్లు తన ఇన్ స్టాగ్రమ్ లో తెలిపాడు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు ఈ ఐదు సంవత్సరాలు దీప్తి అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపాడు. దీప్తికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షణ్ముఖ్ ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్-5 రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ షోలో దీప్తి కూడా హల్ చల్ చేసింది. స్టేజ్ పై షణ్ముఖ్ పై ఉన్న ప్రేమను చెప్పింది. వీరిద్దరు కలిసి చాలా షార్ట్ ఫిలీంలలో కలిసి నటించారు.