క్రికెట్ బెట్టింగ్ లో లాస్ ఉండదంటున్న దీప్తి సునయన.. కేసు పెట్టరా..?

క్రికెట్ బెట్టింగ్ లో లాస్ ఉండదంటున్న దీప్తి సునయన.. కేసు పెట్టరా..?

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ని నిర్మూలించేందుకు పోలీసులు నడుం బిగించి ఇప్పటికే దాదాపుగా పలువురు సినీ సెలబ్రేటీలు, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటివరకూ తెలుగు సినీ సెలబ్రేటీలైన యాంకర్ శ్యామల,  విష్ణు ప్రియ, రీతూ చౌదరి తదితరులు పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో విచారణకి హాజరయ్యారు. 

అయితే ప్రముఖ రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో అలరించిన యంగ్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ దీప్తి సునయన కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రెడిక్షన్స్ టెలిగ్రామ్ ఛానెల్ ని ప్రమోట్  చేసింది. ఈ వీడియోలో ఏకంగా  "మీరు క్రికెట్ బెట్టింగ్స్ ఆడుతుంటారా..? అయితే మీకు లాస్ లేకుండా లాభం వచ్చేట్లు అలాగే ప్రతీ మ్యాచ్ విన్ అయ్యేలా ప్రెడిక్షన్స్ కావాలనుకుంటే తాను చెప్పిన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలని తెలిపింది. అంతేకాకుండా ఆ బెట్టింగ్ ప్రెడిక్షన్ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా తన సోషల్ మీడియా బయోలో ఇస్తున్నానని వెంటనే వెళ్లి జాయిన్ అవ్వాలని తెలిపింది." ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం కలకలం సృష్టించడంతో కొందరు నెటిజన్లు దీప్తి సునయన వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే దీప్తి సునయన పై కూడా కేసులు నమోదు చేసి విచారించాలని కోరుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి దీప్తి సునయన ఎక్కువగా యూట్యూబ్ లో పలు ప్రైవేట్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యింది. ఇదే క్రేజ్ ని ఉపయోగించుకుని బిగ్ బాస్ వరకూ వెళ్ళింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ బెట్టింగ్ ప్రెడిక్షన్స్ టెలిగ్రామ్ ఛానెల్ వ్యవహారం తలనొప్పులు తెచ్చి పెట్టేలా ఉంది. మరి ఈ విషయంపై దీప్తి ఎలా స్పందిస్తుందో చూడాలి.