Deepthi Sunaina: ఏం సైకోగాళ్ళున్నార్రా బాబు.. దీప్తి రిప్లయ్ ఇస్తేనే మందు మానేస్తాడట

Deepthi Sunaina: ఏం సైకోగాళ్ళున్నార్రా బాబు.. దీప్తి రిప్లయ్ ఇస్తేనే మందు మానేస్తాడట

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరు.. ఎందుకు.. ఎప్పుడు.. ఎలా.. వైరల్ అవుతున్నారో అర్థం కావడంలేదు. ఎవరికీ వారు వీడీయోళుచేయడం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవడం. ప్రస్తుత జమానా అంతా ఇలానే నడుస్తోంది. ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంతపెద్ద సెలబ్రెటీ అన్నమాట. అయితే ఇక్కడి వరకు ఒకే కానీ, అది కాస్త లిమిట్స్ దాటితేనే సమస్య. ఇండియా వైడ్ గా ఉన్న టాప్ స్టార్స్ అంతా సోషల్ మీడియాలో ఉండటంతో.. ఎవరు ఎవరితోనైనా డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు. ఆ సెలబ్రెటీని టాగ్ చేస్తూ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ను క్లియర్ గా చెప్పేస్తున్నారు. 

ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో మరో వెర్రి తెరపైకి వచ్చింది. నెటిజన్స్ చేస్తున్నదే చీప్ పనులురా అంటే.. వాటికి సెలెబ్రెటీలు సైతం రిప్లయ్ ఇస్తూ మరింత చీప్ చేస్తున్నారు. ఇటీవల ఒక అమ్మాయి.. నా వీడియోకి విజయ్ దేవరకొండ రిప్లయ్ ఇస్తేనే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను. లేకుంటే లేదు.. అంటూ ఓ వీడియో చేసి విజయ్ దేవరకొండను ట్యాగ్ చేసింది. అది చూసిన విజయ్.. రిప్లయ్ ఇవ్వడం కాదు.. నువ్వు పాస్ అవ్వు కలిస్తాను.. అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో అది కాస్త వైరల్ కావడంతో.. చాలా మంది అదే పనిని ఫాలో అవుతున్నారు. 

ALSO READ :-  క్యాన్సర్ తో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మృతి

తాజాగా ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయనకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. తాజాగా ఓ అభిమాని చేతిలో మద్యం సీసాను పట్టుకొని వీడియో చేస్తూ.. ఈ రీల్ కి దీప్తి సునయన రియాక్ట్ అవుతేనే తాగడం మానేస్తా.. అంటూ రాసుకొచ్చాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దాంతో ఆ వీడియోపై దీప్తి సునయన స్పందిస్తూ.. షాకింగ్ ఎమోజీని యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్స్ దీప్తి రిప్లయ్ ఇచ్చింది మందు మానేస్తున్నావా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.