
మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: మండలంలోని గాజులపేట అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చిన జింకను కుక్కలు వెంబడించడంతో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి పాలమూరు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఆఫీస్ దగ్గర కాంపౌండ్ వాల్‌ను ఢీకొని చనిపోయినట్లు ఎఫ్ఆర్వో చంద్రయ్య తెలిపారు. యూనివర్సిటీ అధికారులు సమాచారం ఇవ్వడంతో జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించినట్లు చెప్పారు.