నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నూతనంగా ఏకో ఫారెస్ట్ జోన్ ఏర్పాటు చేశారు. సమ్మక్క సారక్క గుడి దగ్గర జింకలు బయటకు వస్తున్నాయి. ఇలా బయటకు వచ్చి జింకలు రోడ్డు ప్రమాదాలు, ఇతర జంతువుల దాడికి బలవుతున్నాయి. బుధవారం బయటకు వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడిలో చనిపోయింది. పొలంలో గాయాలతో పడిపోయిన జింక మృతదేహాన్ని చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల కాలంలోనే ఇలా జరగటం ఇది రెండవ సారి. జింకలు బయటకు రావడానికి కారణం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమని స్థానికులు అంటున్నారు.