
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తో్ంది. భారీ వర్షాలకు గోదావరి నదిలో ఓ జింక కొట్టుకు వచ్చింది. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటు ములుగు జిల్లాలోనూ బీభత్సమైన వానలు పడుతున్నాయి. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో గోదారమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద నీటిలో వాజేడు గ్రామ శివారుకు జింక కొట్టుకొచ్చింది. ఆ జింకను కుక్కలు వెంబడిస్తుండగా..దీన్ని గమనించిన స్థానికులు దాన్ని కాపాడారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వాజేడు గ్రామానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు..జింకకు ప్రథమ చికిత్స చేసి ...జూపార్కుకు తరలించారు.