
క్రమశిక్షణ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ. ఇది ఓ వ్యక్తి విజయాన్ని నిర్ణయించడంలో కీలకం. క్రమపద్ధతిలో, స్థిరంగా నియమ నిబంధనలు పాటించడమే క్రమశిక్షణను సూచిస్తుంది. క్రమశిక్షణ.. వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధికి బాటలు వేస్తుంది. స్వీయ నియంత్రణ, బాధ్యత, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. సమయం, ఉన్న అవకాశాలను ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలో నేర్పిస్తుంది. అందుకే క్రమశిక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అంశం కావాలి..
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ జింక ప్రదర్శించిన క్రమశిక్షణకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. జపాన్లో ఓ సిగ్నల్ దగ్గర ఓపిగ్గా నిలబడి.. ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత జింక రోడ్డు దాటడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా క్రమశిక్షణ గల జింక.. దీనిని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి అని కామెంట్లు పెట్టారు.. సంఘటన ఎక్కడ జరిగినా.. క్రమ శిక్షణతో జింక రోడ్డు దాటిన విషయం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. షేర్ చేసిన కొన్ని గంటల్లో ఈ వీడియోను తెగ చూసేశారు నెటిజన్లు.. కామెంట్లు కూడా బాగానే వచ్చాయి.
వ్యక్తిగత సంబంధాలు, వృత్తిపరమైన వాతావరణంలో కూడా క్రమశిక్షణ చాలా కీలకం. ఇది గౌరవం, జవాబుదారీతనం, టీం వర్క్ ని పెంపొందిస్తుంది. ఇది వ్యక్తులు సామరస్యపూర్వకంగా కలిసి పనిచేయడానికి, విభేదాలను పరిష్కరించడానికి, ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి దోహదం చేస్తుంది. క్రమశిక్షణ వ్యక్తులు సమగ్రతను, నైతిక ప్రమాణాలకు కట్టుబడి, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది. అందుకే క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
A deer in Nara, Japan, patiently waits for traffic to halt before crossing??
— Tansu YEĞEN (@TansuYegen) August 26, 2023
pic.twitter.com/uMvi75Tt6k