- వనపర్తి జిల్లాలో రైతుల అవస్థలు
వనపర్తి జిల్లాలో పంటలను జింకలు ఆగం చేస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో జింకలు మందలు మందలుగా తిరుగుతూ పంటలపై దాడి చేస్తున్నాయి. చిన్నంబావి మండలం కృష్ణానది పరివాహక గ్రామాల్లో జింకలు హల్ చల్ సృష్టిస్తున్నాయి. చిన్నమరూరు, వెల్దూర్, కాలూర్, బెక్కం, గూడెం, అయ్యవారిపల్లి, కొప్పునూరు గ్రామాల్లో జింకలు మందలు మందలుగా తిరుగుతూ సోయాబీన్, ఉల్లి, పెసర, మినుము పంటలను నాశనం చేస్తున్నాయి.
జింకల బెడద నుంచి తమ పంటలను కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. జింకల దాడిలో దెబ్బతిన్న పొలాలను చిన్నంబావి జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటరమణమ్మ పరిశీలించారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.