కుక్కల దాడిలో గాయపడ్డ దుప్పి

కుక్కల దాడిలో గాయపడ్డ దుప్పి

చండ్రుగొండ, వెలుగు : మండల పరిధిలోని అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన దుప్పిపై గురువారం కుక్కలు దాడి చేసి గాయపర్చాయి.  ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రామవరం రేంజ్ లోని ఫారెస్ట్ నుంచి మేత కోసం తిప్పనపల్లి గ్రామ శివారులోని పంటపొలాలోకి వచ్చిన దుప్పి రోడ్డు దాటుతుండగా కుక్కలు దాడి చేశాయి. 

దీన్ని గమనించిన స్థానికులు దుప్పిని కాపాడి  ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. తిప్పనపల్లి బీట్ ఆఫీసర్ సుమిత్ర సిబ్బందితో వచ్చి దుప్పిని రామవరం పశువైద్యశాలకు తరలించారు. అనంతరం కిన్నెరసాని జూ పార్క్ కు పంపించారు.