
- కుక్కల దాడిలో గాయపడిన మరో జింక
గచ్చిబౌలి, వెలుగు: హెచ్‌సీయూ నుంచి శుక్రవారం బయటకు వచ్చిన ఓ జింకను ఫారెస్ట్ అధికారులు పట్టుకుని జూపార్కుకు తరలించారు. మరో జింక కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడింది. శుక్రవారం మధ్యాహ్నం వర్సిటీ వెనక వైపు ఉన్న ఎన్టీనగర్వైపు ఓ జింక కనిపించింది. ఓ ఫ్లైవుడ్ షాప్‌లోకి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ వస్తువులను చిందరవందర చేసింది.
తర్వాత బయటకు వచ్చిన జింకను కుక్కలు తరమడంతో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లింది. స్థానికులు గచ్చిబౌలి పోలీసులు, ఫారెస్ట్, జూపార్క్అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి జింకను వలవేసి పట్టుకొని జూ పార్కుకు తరలించారు. అలాగే ఉదయం.. విద్యార్థుల హాస్టల్స్వెనుక వైపు ప్రాంతంలో శుక్రవారం ఓ జింక కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్టూడెంట్స్వర్సిటీ సెక్యూరిటీ, ఫారెస్ట్, జూ పార్కు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు గాయపడ్డ జింకను వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు.