
- ‘డీట్’ యాప్, వెబ్‍సైట్‍లో ఫ్రీ రిజిస్ట్రేషన్
- ఓటీపీ వెరిఫికేషన్.. మూడంచెల్లో రిక్రూట్‍మెంట్
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ ప్లాట్‍ఫామ్స్ పై జాబ్‍లు పొందేలా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) యాప్, వెబ్‍సైట్ అందుబాటులో ఉంది. ఈ సర్వీస్‍ని ఉచితంగా అందజేస్తున్నారు. టెక్నాలజీ యుగంలో మొబైల్ వేదికగా రిక్రూట్‍మెంట్‍ను అందించేందుకు దీన్ని ప్రారంభించారు. యాప్ తో రిక్రూటర్లు, నిరుద్యోగులకు సమయం ఆదా అవుతోంది. దళారులు, ఫేక్ కంపెనీల చేతిలో నిరుద్యోగులు మోసపోకుండా ఉంటుంది. ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ, స్టోరీ టెక్ అనే ప్రైవేట్ ఐటీ సంస్థలు నిర్వహిస్తున్నాయి. జీఎంఆర్, అపోలో హాస్పిటల్స్, ఆసియాన్ పెయింట్స్, స్విగ్గీ వంటి కంపెనీలతో పాటు మరెన్నో ఎంఎన్‍సీ, ఐటీ కంపెనీల్లో జాబ్ ఆఫర్స్ ఉన్నాయి.
ఎలా పని చేస్తుందంటే..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీఎస్‍డీట్ యాప్ డౌన్‍లోడ్ చేసుకోవాలి. ఏ జాబ్ కవాలో వివరాలు ఎంటర్ చేయాలి. రెజ్యుమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను అప్‍లోడ్ చేయాలి. జాబ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మెయిల్‍కు మెసేజ్ వస్తుంది. వివిధ రంగాల్లో దాదాపు 45 వేల వరకు జాజ్ ఆఫర్స్ ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు.
యూజర్ ఫ్రెండ్లీగా..
నిరుద్యోగులు, కంపెనీల ప్రొఫైల్స్ ను ఫిల్టర్ చేసేందుకు అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టం(ఏటీఎస్), మెషిన్ లెర్నిం గ్(ఎంఎల్), ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్(ఏఐ) వంటి యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీ ఉంది. రిక్రూట్ మెంట్ ప్రాసెస్‍ను పారదర్శకంగా చేపడుతున్నట్లు స్టోరీ టెక్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.