మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా కేసు వాయిదా

మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా కేసు వాయిదా

బషీర్ బాగ్, వెలుగు : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ వేర్వేరుగా దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్లపై బుధ వారం నాంపల్లి ప్రత్యేక కోర్టు విచా రణను వాయిదా వేసింది. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీ ఆర్ అంటూ మంత్రి సురేఖ కామెంట్​ చే శారు. ఈ కేసులో నాగార్జున కుటుంబ సభ్యులు, కేటీఆర్ స్టేట్​మెంట్లను రికార్డ్ చేసింది. బుధవారం సురేఖ తరఫు అడ్వకేట్ గురుమిత్ సింగ్ హాజరయ్యారు. జడ్జి సెలవులో ఉండడంతో 2పిటిషన్లపై విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.