కేటీఆర్‌పై క్రిమినల్​పిటిషన్

కేటీఆర్‌పై క్రిమినల్​పిటిషన్
  • నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సూదిని సృజన్​రెడ్డి
  • తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడి
  • శోధ కన్​స్ట్రక్షన్స్​తో తనకు సంబంధం లేదన్న సూదిని
  • అమృత్‌ 2.O టెండర్స్‌ పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం
  • లీగల్​ నోటీసులిచ్చినా కేటీఆర్​ తీరు మార్చుకోలేదని కామెంట్​
  • సోమవారం పిటిషన్​ విచారణకు వచ్చే చాన్స్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌పై పరువు నష్టం దావా దాఖలైంది. అమృత్‌‌‌‌2.O టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రముఖ వ్యాపారవేత్త సూదిని సృజన్‌‌‌‌రెడ్డి శనివారం​ నాంపల్లి స్పెషల్ కోర్ట్‌‌‌‌లో  సెక్షన్​ 356 (బీఎన్ఎస్) కింద​క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు సంబంధం లేని కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ కంపెనీతో  ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. 

తనను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి బామ్మర్దిని అని పేర్కొంటూ.. తనకు రూ.8,888 కోట్లు విలువ చేసే టెండర్స్‌‌‌‌ను అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు చేసినట్టు  తెలిపారు. అమృత్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ టెండర్స్‌‌‌‌ దక్కించుకున్న శోధా కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌ కంపెనీలో తనకు షేర్లు లేవని, తాను డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ను కూడా కాదని స్పష్టం చేశారు. 

తనకు చెందిన శోధా కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌, ఇండియన్‌‌‌‌ హ్యూమ్ పైప్ కంపెనీకి జాయింట్ వెంచర్ పేరుతో  రూ.1,137.77 కోట్లు విలువ చేసే అమృత్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ టెండర్స్‌‌‌‌ అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడినట్టు సృజన్ రెడ్డి తన పిటిషన్‌‌‌‌లో వివరించారు.ఈ పిటిషన్‌‌‌‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. 

లీగల్ నోటీసులు ఇచ్చినా తీరుమారలే

కేటీఆర్​కు లీగల్​ నోటీసులు ఇచ్చినా ఆయన తీరుమారలేదని పిటిషన్​లో సృజన్​రెడ్డి  వెల్లడించారు. సెప్టెంబర్​9,  ఈ నెల 11న కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడిన స్పీచ్‌‌‌‌లకు సంబంధించిన న్యూస్​ పేపర్స్ క్లిప్పింగ్స్‌‌‌‌, చానల్స్‌‌‌‌లో టెలికాస్ట్‌‌‌‌ అయిన వీడియో ఫుటేజ్‌‌‌‌, సోషల్‌‌‌‌మీడియాలో వైరల్‌‌‌‌ అయిన వీడియోలు సహా పూర్తి ఆధారాలను కోర్టుకు అందించారు. 

తనపై చేసిన అసత్య ఆరోపణలకు సంబంధించి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 26న కేటీఆర్​కు లీగల్ నోటీస్‌‌‌‌ పంపించినట్టు తెలిపారు. శోధా కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌ తనకు చెందిన కంపెనీ కాదని, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తనకు బావ కాదని, నిజానిజాలు తెలియకుండా అసత్య ఆరోపణలు చేయకూడదని సూచించినట్టు కోర్టుకు వివరించారు. అయినప్పటికీ ఈ నెల 11న ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో తనపై కేటీఆర్​ అసత్య ఆరోపణలు చేశారని సృజన్‌‌‌‌రెడ్డి తెలిపారు.

  పరువుకు భంగం కలిగించారని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. శోధా కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌కు ఎండీగా కందాల దీప్తిరెడ్డి వ్యవరిస్తున్నారన్నారని తెలిపారు. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను  డైరెక్టర్‌‌‌‌ను కూడా కాదని స్పష్టం చేశారు. అమృత్2లో ఏఎమ్‌‌‌‌ఆర్‌‌‌‌ -శోధ, ఐహెచ్‌‌‌‌పీ కంపెనీలు కాంట్రాక్ట్‌‌‌‌ దక్కించుకున్నాయని  చెప్పారు. 

జాయింట్ వెంచర్‌‌‌‌లో 29 శాతం మాత్రమే వాటా ఉన్నట్టు వివరించారు. అమృత్‌‌‌‌ స్కీమ్ టెండర్స్ పూర్తి పారదర్శకంగా జరిగినట్టు తెలిపారు. ఈ టెండర్స్‌‌‌‌ విధానంతో కేటాయింపులు జరిగాయని వివరించారు. ఓ మాజీ మంత్రిగా టెండర్స్‌‌‌‌పై అవగాహన ఉన్నప్పటికీ తనపై కేటీఆర్​ అసత్య ఆరోపణలు చేసినట్టు పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు.