డీకే అరుణపైపరువునష్టం దావా వేస్తా : బండ్ల కృష్ణమోహన్​రెడ్డి

డీకే అరుణపైపరువునష్టం దావా వేస్తా :  బండ్ల కృష్ణమోహన్​రెడ్డి

గద్వాల, వెలుగు: తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ నేత డీకే అరుణపై పరువునష్టం దావా వేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి తెలిపారు. గద్వాలలో శుక్రవారం సాయంత్రం ఆయన తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. తనకు కోర్టు నుంచి ఇంకా నోటీసులు అందలేదన్నారు. నాలుగు అంశాలపై తనపై అభియోగాలు మోపారని, అవన్నీ ఫేక్  అని ఆరోపించారు. ఈవీఎంలలో ఎవరికి ఓటేసినా బీఆర్ఎస్ కే పడుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో అమ్మిన భూములు కూడా తన పేరు మీద ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అలాగే ట్రాన్సక్షన్​లో లేని అకౌంట్లు ఉన్నట్లు చూపించారని, అమ్ముకున్న భూములు అలాగే ఉన్నట్లు చూపించారని ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టించారని, తనకు సుప్రీంకోర్టులో 10 రోజుల్లో రిలీఫ్ వస్తుందని ఆ తర్వాత వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు.