వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాలి మహారాష్ట్రలో ఈసీనికోరనున్న ఓడిన అభ్యర్థులు

వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాలి మహారాష్ట్రలో ఈసీనికోరనున్న ఓడిన అభ్యర్థులు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రతిపక్ష ఎంవీఏ అభ్యర్థులు.. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఎంవీఏ కూటమికి 46 సీట్లే దక్కాయి. శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10 గెలుచుకున్నాయి. అయితే ఇటీవల శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో ఆ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థులు సమావేశమయ్యారు. వారిలో చాలామంది ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి ఓడిన అభ్యర్థులు కూడా హైకమాండ్  కు ఇదే విధంగా ఫిర్యాదు చేశారు. దీంతో వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ఈసీని కోరాలని కూటమి పార్టీల నేతలు నిర్ణయించారు.