న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం (జూలై11) అస్వస్థతకు గురయ్యారు. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న రాజ్ నాథ్ సింగ్ ను చికిత్స కోసం ఢిల్లీలో ఎయిమ్స్ కు తరలించారు. 73 యేళ్ల రాజ్ నాథ్ సింగ్ కు ఎయిమ్స్ లోని ఓల్డ్ ప్రైవేట్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, మెడికల్ అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు ఎయిమ్స్ డాక్టర్లు.
బీజేపీ సీనియర్ నేత , కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో ఎంపీ గా ఉన్నారు సాధారణ రైతు కుటుంబానికి చెందిన రాజ్ నాథ్ గోరఖ్ పూర్ యూనివర్సిటీలో చదువుకున్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 13యేళ్లకే ఆర్ ఎస్ ఎస్ లో చేరిన రాజ్ నాథ్ సింగ్ 1977లో మీర్జాపూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంతో ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో రాజ్ నాథ్ సింగ్ జైలుకు కూడా వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
బీజేపీ నేతగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు రాజ్ నాథ్ సింగ్.. మోదీ ప్రభుత్వంలో వరుసగా మూడో సారి రక్షణ మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. దేశ రక్షణ విషయాల్లో అత్యంత కీలక మైన నిర్ణయాలతో తమదైన శైలీలో దూసుకుపోతున్నారు.