జమ్మూ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) నివాసితులకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆఫర్ ఇచ్చారు. మిమ్మల్ని విదేశీయులుగా పరిగణిస్తున్న పాకిస్తాన్ లా కాకుండా మిమ్మల్ని మా సొంత మనుషుల్లా చూసుకుంటాం..భారత్ లోకి రండి అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. ఆదివారం (సెప్టెంబర్ 08,2024) నాడు కాశ్మీర్ లో బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్ కు మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఈవ్యాఖ్యలు చేశారు.
ఆర్టికల్370ని పునరుద్దరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిచేసిన ఎన్నికల హామీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మొంత్తం భద్రతా పరిస్థితిలో ఇప్పుడు యువకులు పిస్టల్స్, రివాల్వర్స్ కు బదులుగా ల్యాప్ టాప్ లు , కంప్యూటర్లు తీసుకెళ్తు న్నార ని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి గెలిపించండి.. తర్వాత మేం చేసే అభివృద్ధిని చూసి మీరే భారత్ లో చేరతారని అక్కడి ప్రజలకు రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.