ఆదిలాబాద్​లో పౌర విమానయాన సేవలకు రెడీ .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ రిప్లై

ఆదిలాబాద్​లో పౌర విమానయాన సేవలకు రెడీ .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ రిప్లై

న్యూఢిల్లీ, వెలుగు: ఆదిలాబాద్​లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం కీలక ముందడుగు పడింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని విమానాశ్రయంలో.. పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజ్ నాథ్ లేఖ రాశారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు అందులో పేర్కొన్నారు. అలాగే, పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. 

ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం.. ఈ ఏడాది జనవరిలో కేంద్ర రక్షణ మంత్రికి లేఖల రూపంలో విజ్ఞప్తులు చేసినట్టు చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఆయా విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించడంతో పాటుగా సంపూర్ణ సహకారం అందించాలన్నారు.