ఈ మధ్య ఆడవాళ్లపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే ఆడవాళ్లు సేఫ్టీ గాడ్జెట్స్ వాడడం మంచిది. డిఫెండర్ 24/7 అనే కంపెనీ ఒక స్మార్ట్ పర్సనల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ని తెచ్చింది. ఇది పెప్పర్ స్ర్పే. అంతేకాకుండా కెమెరాలాగా కూడా పనిచేస్తుంది. ఎవరైనా దాడి చేసినప్పుడు దీంతో అవతలివాళ్ల ముఖం మీద స్ర్పే చేయాలి. అదే టైంలో ఈ గాడ్జెట్ వాళ్ల ముఖాన్ని ఫొటో తీస్తుంది. ఆ ఫొటోతోపాటు లొకేషన్ని మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్న ఎమర్జెన్సీ నెంబర్లకు పంపుతుంది. దీన్ని మొబైల్‌తో కనెక్ట్ చేసి వాడుకోవాలి. జీపీఎస్, సైరన్ ఫీచర్లు కూడా ఉన్నాయి ఇందులో.
ధర: సుమారు 12,600 రూపాయలు