హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన కారును డిఫెండర్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. బ్రేక్ డౌన్ అయిన కారులో ఉన్న ప్యాసింజర్ కారు దిగి పక్కకు నిల్చోవడంతో అతడికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో భయపడ్డ డిఫెండర్ కారు డ్రైవర్ రోడ్డుపైనే కారు వదిలేసి పారిపోయాడు.
రోడ్డు ప్రమాదంతో ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఓఆర్ఆర్ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.