మస్కట్: విమెన్స్ జూనియర్ ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పూల్–ఎ మ్యాచ్‌లో ఇండియా 9–0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. దీంతో జూనియర్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.
ఇండియా స్ట్రయికర్ దీపిక హ్యాట్రిక్ (28, 31, 35, 55వ ని)తో కలిపి నాలుగు గోల్స్ కొట్టింది. రాణా సాక్షి (17వ ని), సివాచ్ కనికా (23, 25, 40వ ని), లాల్రినుపి (27వ ని) అండగా నిలిచారు. ఆట ఆరంభం నుంచి ఎదురుదాడులకు దిగిన ఇండియా ఫార్వర్డ్స్.. థాయ్‌లాండ్ డిఫెన్స్‌ను ఈజీగా ఛేదించారు.