షార్జా : విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. పేసర్ మేగన్ షట్ (3/3) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో మంగళవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఆసీస్ 60 రన్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన కంగారూ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 148/8 స్కోరు చేసింది. బెత్ మూనీ (40), ఎలైస్ పెర్రీ (30), కెప్టెన్ అలీసా హీలీ (26), ఫోబ్ లిచ్‌ఫెల్డ్ (18) రాణించగా మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు.
కివీస్ బౌలర్లలో అమెలియా కెర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రోస్‌మెరీ మైర్, బ్రూక్ హలీడే చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 88 రన్స్‌కే కుప్పకూలింది. అమెలియా కెర్ (29), సుజీ బేట్స్ (29), లియా తహుహు (11) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. మేగన్‌తో పాటు అనాబెల్ సదర్లాండ్ (3/21), సోఫీ మెలినూక్స్ (2/15) దెబ్బకు మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మేగన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.