
థింపు: డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ఫుట్‌బాల్ టీమ్ శాఫ్ అండర్17 చాంపియన్‌షిప్‌ను విజయంతో ఆరంభించింది. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఇండియా 1–0తో బంగ్లాదేశ్‌ను ఓడించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ డిఫెన్స్‌లో సత్తా చాటాయి. నిర్ణీత 90 నిమిషాల్లో బంగ్లా డిఫెన్స్‌ను ఇండియా బ్రేక్ చేయలేకపోయింది. అయితే, ఇంజ్యురీ టైమ్‌లో డిఫెండర్ సుమిత్ శర్మ (90+1వ నిమిషం) హెడ్డర్‌తో గోల్ చేసి ఇండియాను గెలిపించాడు.