- సెమీస్‌లో 2-0తో జపాన్‌పై గెలుపు
- సా. 4.45 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
రాజ్‌గిర్ (బీహార్) : విమెన్స్ హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా వరుసగా రెండోసారి విజేతగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో ఆతిథ్య జట్టు అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన ఇండియా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 2–-0తో జపాన్‌ను చిత్తుచేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి మూడు క్వార్టర్స్‌లో ఇరు జట్లూ ఖాతా తెరవలేకపోయాయి. ఆటలో ఇండియా పైచేయి సాధిస్తూ చాలా పెనాల్టీ కార్నర్లు సాధించింది. కానీ, 13 పెనాల్టీ కార్నర్లను వృథా చేసింది.
చివరకు వైస్ కెప్టెన్ నవనీత్ కౌర్ 48వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌తో తొలి గోల్ కొట్టి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆపై లాల్‌రెమ్‌సిమామి 56వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేయడంతో వరుసగా రెండోసారిలో జపాన్‌పై ఇండియాదే పైచేయి అయింది. మరో సెమీఫైనల్లో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ చైనా 3-–1తో మలేసియాను ఓడించింది. బుధవారం జరిగే ఫైనల్లో చైనాతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.