హైదరాబాద్, వెలుగు: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ అద్భుతంగా ఆడుతోంది. లీగ్‌లో ఐదో విజయంతో టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 49–30తో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఆకాశ్ షిండే (11 పాయింట్లు) సూపర్ టెన్తో మెరవగా.. పంకజ్ మోహితె (8) సత్తా చాటాడు. జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ ( 13) పోరాడాడు. మరోమ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 36–-32తో తమిళ్ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఈ సీజన్లో రెండో విక్టరీ ఖాతాలో వేసుకుంది. బుల్స్ ఆటగాళ్లలో అజింకా పవార్, అక్షిత్ చెరో ఆరు పాయింట్లతో రాణించారు.