
హైదరాబాద్, వెలుగు : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ జోరు చూపెడుతోంది. లీగ్‌లో నాలుగో విజయంతో మళ్లీ టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పల్టాన్ 35–-28తో యు ముంబాపై విజయం సాధించింది. కెప్టెన్ అస్లాం ఇనాందార్ (10 పాయింట్లు) సూపర్ టెన్ తో మెరిశాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 40-–38తో హర్యానా స్టీలర్స్‌పై గెలిచింది.